క్రేజీ డైరెక్టర్ నుండి ‘మహాసముద్రం’ !

క్రేజీ డైరెక్టర్ నుండి ‘మహాసముద్రం’ !

Published on Feb 6, 2019 11:07 PM IST

ajay bhupati

“ఆర్ఎక్స్ 100” అనే బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి. ఈ చిత్రం బాక్స్ అఫీస్ వద్ద భారీ షేర్‌ను రాబట్టుకుంది. దీంతో అజ‌య్ భూప‌తి తరువాత సినిమా పై కూడా భారీ అంచనాలు పెరిగాయి. కాగా అజేయ్ భూపతి ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తన రెండో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ‘మహాసముద్రం’ అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ ‘మహాసముద్రం’ సబ్జెక్టు మాఫియా నేపథ్యంలో సాగుతుందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అక్కినేని సమంతను తీసుకోవాలని.. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమైనదట.. అందుకే ఎలాగైనా సమంతను ఒప్పించాలని అజేయ్ అనుకుంటున్నాడట. అయితే సాయి శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్ గా అల్లుడు శ్రీను సినిమాలో నటించింది.

తాజా వార్తలు