ఈ హిట్ డైరెక్టర్ పరిస్ధితి ఏంటి ?

Published on Jun 4, 2019 9:16 am IST

“ఆర్ఎక్స్ 100” లాంటి బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు అజ‌య్ భూప‌తి. తన మొదటి సినిమా అవకాశం కోసం అజయ్ ఎంత కష్టపడ్డాడో తెలియదు గాని, రెండో సినిమా కోసం మాత్రం బాగానే కష్టపడుతున్నాడు. అయినప్పటికీ అజయ్ కి మాత్రం సినిమా సెట్ కావట్లేదు. ఒక సినిమా హిట్ అయిందంటే ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయి. ఎందుకో అజయ్ విషయంలో ఇలా జరగలేదు. మొదట రామ్ తో సినిమా అనుకున్నాడు, అది క్యాన్సిల్ అయింది. ఆ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా అనుకున్నాడు. ఆ మేరకు అజ‌య్ భూప‌తి స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ అది కూడా క్యాన్సిల్ అయింది.

ఆ తరువాత సమంత – నాగచైతన్య జంటగా కాప్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి, అదీ లేదని తేలిపోయింది. అన్నట్లు ఆ మధ్య తన సినిమాకు సంబంధించిన వార్తల పై ఆజేయ్ స్పందిస్తూ.. తన సినిమా ఎప్పుడు తియ్యాలో ఎవరితో తియ్యాలో తనకు తెలుసున్నట్లు స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. కానీ సినిమా అప్ డేట్ గురించి రివీల్ చెయ్యలేదు. ఏమైనా “ఆర్ఎక్స్ 100” లాంటి హిట్ సాధించిన అజయ్ భూపతి కూడా రెండో సినిమా అవకాశం అంత తేలిగ్గా వచ్చేలా లేదు.

సంబంధిత సమాచారం :

More