ఆ హిట్ డైరెక్టర్ ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ?

Published on Apr 21, 2019 4:46 pm IST

దర్శకుడు అజ‌య్ భూప‌తి తన మొదటి సినిమాగా “ఆర్ఎక్స్ 100” లాంటి బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. పైగా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ షేర్‌ నే రాబట్టుకుంది. అయినప్పటికీ అజయ్ భూపతికి మాత్రం ఇప్పటికి కూడా సినిమా సెట్ కావట్లేదు. ఒక సినిమా హిట్ అయిందంటే ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయనేది వాస్తవమే.. కానీ ఈ వాస్తవం ఎందుకో అజయ్ విషయంలో వర్తించలేదు. ఎంత మంది హీరోలకు ట్రే చేసినా సినిమా మాత్రం ముందుకు వెళ్లట్లేదు.

“ఆర్ఎక్స్ 100” రిలీజ్ అయిన కొత్తల్లో రామ్ హీరోగా భవ్య మూవీస్ లో ఓ సినిమా ఉందన్నారు.. ఏమైందో ఏమో అది కాస్త క్యాన్సిల్ అయింది. ఈ లోపు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా అనుకున్నారు. ఆ మేరకు అజ‌య్ భూప‌తి స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ అది కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా ఉందంటున్నారు.

కానీ చైతు తన తరువాత సినిమా విషయంలో ఆల్ రెడీ కమిట్ అయ్యాడని టాక్. మరి ఈ లెక్కన అజయ్ అన్నపూర్ణ కాంపౌండ్ లో ఇంకా చాలా రోజులు వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి ఉన్నట్లే లెక్క. హిట్ సినిమా తీసాక్కూడా ఈ వెయిటింగ్ ఎంటో.. !

సంబంధిత సమాచారం :