హిందీ ‘ఖైదీ’ అక్టోబర్ నుండి.. !

హిందీ ‘ఖైదీ’ అక్టోబర్ నుండి.. !

Published on Apr 2, 2020 12:00 AM IST

తమిళ సినిమా ‘ఖైదీ’ తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. ఈ మధ్య దక్షిణాది పరిశ్రమల సినిమాల పై ఆసక్తిగా ఉన్న బాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్రం బాగా నచ్చింది. అందుకే ఈ రీమేక్ చిత్రంలో స్టార్ హీరోనే ఉంచాలని భావించి అజయ్ దేవగన్ ను సంప్రదించగా అజయ్ దేవగన్ సైతం చిత్రాన్ని చూసి వెంటనే డేట్స్ ఇచ్ఛేసిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు ఈ సినిమా షూటింగ్ వెనక్కి వెళ్లిన సంగతి తెలిసింది.

కాగా తాజాగా బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. ఇక కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. కార్తి హీరోగా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. మరి అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు