తుది దశకు చేరుకున్న అజిత్ ‘విశ్వాసం’ షూటింగ్ !

ajith

తల అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’చిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈచిత్రం ఎక్కువ భాగాన్ని హైద్రాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కించారు. ఇక తదుపరి షెడ్యూల్ ను పూణే ముంబై లో రెండు రోజులు షూట్ చేసి చివరి షెడ్యూల్ కోసం చెన్నై చేరనుంది. ఈనెల చివర్లో ఈ లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కానుంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్లో నటిస్తున్నాడు.

పక్క యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నయనతార కథనాయికగా నటిస్తుంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. అదే సమయంలో రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ కూడా విడుదలకానుండడంతో ఈ రెండు చిత్రాలు బాక్సాఫిస్ వద్ద పోటీపడనున్నాయి.

Exit mobile version