
ఈ ఏడాది ప్రారంభంలో విశ్వాసంతో సూపర్ హిట్ కొట్డాడు తల అజిత్. పొంగల్ కానుకగా విడుదలైన ఈ చిత్రం 200కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తరువాత అజిత్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అజిత్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
తాజాగా ఈ షూటింగ్ లో పాల్గొనడానికి అజిత్ హైదరాబాద్ చేరుకున్నాడు. దాదాపు 20 రోజుల పాటు అజిత్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. విద్యాబాలన్ , శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వినోత్ తెరకెక్కిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ‘విశ్వాసం’ తెలుగు అనువాదం మార్చ్ 1న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

