“కేజీయఫ్ 2″ని దాటి హిస్టరీ క్రియేట్ చేసిన అజిత్ సినిమా!

Published on Jun 26, 2021 8:10 pm IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఇంకా రిలీజ్ కాకుండా ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా కొన్ని సాలిడ్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2” ఒకటి. రిలీజ్ దగ్గరలో ఉండి ఇండియన్ లెవెల్లో ఆసక్తి రేపిన చిత్రాల్లో ఇది మొదటిది.

అందుకే బుక్ మై షో లో ఎప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్ రాక ముందే లక్ష మంది ఇంట్రెస్ట్ చూపించి సెన్సేషనల్ రికార్డు నెలకొల్పారు. తర్వాత అది కాస్త మూడు లక్షలుకు వెళ్లి మరో భారీ రికార్డును ఇండియన్ లెవెల్లో సెట్ చేసింది. మరి రికార్డ్స్ అన్నిటిని తమిళ్ స్టార్ హీరో థలా అజిత్ బద్దలు కొట్టేసాడు.

ఇంకా ఫస్ట్ లుక్ కూడా రాని ఈ చిత్రం ఏకంగా 5 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ తో హిస్టరీ నే క్రియేట్ చేసేసింది. దీనితో అజిత్ అభిమానులు ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో మరోసారి అర్ధం అయ్యింది. ఇది కూడా జస్ట్ ఈ రెండు రోజుల్లో క్రాస్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తుండగా యువన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :