స్టైలిష్ & పవర్ఫుల్ గా అజిత్ ‘తునీవు’ ట్రైలర్

Published on Dec 31, 2022 10:18 pm IST


తలా అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తునీవు. బోనీ కపూర్ తో కలిసి జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా భారీ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెకక్కింది. ఇక ఇటీవల ఈ మూవీ నుండి మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ కంపోజ్ చేసిన సాంగ్స్ రిలీజ్ అయి అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.సంక్రాంతి కానుకగా 2023, జనవరి 12న ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న తునీవు ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేసారు.

ఆద్యంతం ఆకట్టుకునే థ్రిల్లింగ్, యాక్షన్ హంగులతో తెరకెక్కిన ఈ ట్రైలర్ స్టైలిష్ గా పవర్ఫుల్ గా అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్ లో అజిత్ స్టైలిష్ లుక్స్, డైలాగ్స్, యాక్షన్, ఫైట్ సీన్స్ తో పాటు గ్రాండియర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచి ఇప్పటివరకు మూవీ పై అందరిలో ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం యూట్యూబ్ లో తునీవు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ భారీ వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా ఈ మూవీ తెలుగులో తెగింపు టైటిల్ తో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :