స్టార్ హీరో సినిమా.. మూడే నెలలు టైమ్

Published on Jun 16, 2021 9:07 pm IST

తమిళ హీరో అజిత్ ఒక దర్శకుడ్ని నమ్మితే ఎంతవరకు తీసుకెళ్తారో డైరెక్టర్ శివను చూస్తే అర్థమవుతుంది. శివతో అజిత్ వరుసగా నాలుగు సినిమాలు చేశారు. నాలుగు సూపర్ హిట్ సినిమాలే. శివకు ఎలాగైతే వరుసగా ఆఫర్లు ఇచ్చారో ఇప్పుడు హెచ్.వినోత్ కు కూడ మూడు అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వినోట్, అజిత్ కాంబినేషన్లో ‘నెర్కొండ పారవై’ చిత్రం రాగా రెండవ సినిమాగా ‘వాలిమై’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఇంకొద్దిగా చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మూడవ ఛాన్స్ ఇచ్చారు అజిత్. ‘వాలిమై’ షూటింగ్ ముగియగానే ఈ సినిమాను మొదలుపెడతారట. కేవలం రెండు నుండి మూడు నెలల్లో ఈ చిత్రాన్ని ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట అజిత్, వినోత్. అంటే ఈ ఏడాదిలోనే ఈ సినిమాను కూడ పూర్తిచేసేస్తారన్నమాట. అంతేకాదు ‘వాలిమై’ రిలీజ్ వరకు కూడ ఆగట్లేదట. ఆ సినిమా ఫినిష్ అవ్వడంతోనే దీన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళిపోతారట. వినోత్ అనుకున్నట్టే సినిమాను రెండు మూడు నెలల్లోపు కంప్లీట్ చేస్తే విశేషమే మరి.

సంబంధిత సమాచారం :