
తమిళ సూపర్ స్టార్ అజిత్ తన తాజా చిత్రం షూటింగ్ కోసం సిద్ధమౌతున్నాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన గత చిత్రం ‘ఎన్నై అరిందాల్’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో ‘ఎంతవాడు గానీ..’ పేరుతో తెలుగులో విడుదలవనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్నై అరిందాల్’ విజయంతో జోరు మీదున్న అజిత్ ఇప్పటికే కొత్త చిత్రాన్ని మొదలు పెట్టేశాడు.
గతంలో తెలుగులో గోపీచంద్ ‘శౌర్యం’ సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ స్టార్ డైరెక్టర్ శివ, అజిత్ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈమధ్యే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 25నుంచి మొదలవనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అజిత్ సరసన శృతి హాసన్ నటించే అవకాశం కనిపిస్తోంది. జిల్ సినిమా ద్వారా సూపర్ స్టైలిష్ విలన్‌గా పేరు తెచ్చుకున్న కబీర్ ఈ సినిమాలో విలన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

