ఆ స్టార్ హీరో నెక్స్ట్ చేయబోయేది థ్రిల్లర్ !

Published on Jun 7, 2019 4:20 pm IST

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది హిందీ చిత్రం ‘పింక్’కు తమిళ రీమేక్. ఈ చిత్రం తర్వాత కూడా అజిత్ హెచ్. వినోత్ దర్శకత్వంలోనే ఇంకో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు కూడా బోనీ కపూర్ నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ షూటింగ్ సమయంలో రేసింగ్ పట్ల అజిత్ ఆసక్తిని గమనించాను. సహజంగానే ఆయనకు స్పీడ్ అంటే చాలా ఇష్టం. అందుకు తగ్గట్టే మా తర్వాతి సినిమా పూర్తిస్థాయి థ్రిల్లర్ జానర్లో ఉంటుంది అన్నారు. మరోవైపు ఈ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆగష్టు నుండి మొదలుకానున్న ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :

More