అజిత్ తర్వాతి సినిమా విడుదల ఎప్పుడో కన్ఫర్మ్ అయింది

Published on Jun 24, 2021 10:33 pm IST

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం హెచ్.వినోత్ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తున్నారు. ఇంకొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. గతంలో వినోత్, అజిత్ కలిసి ‘నెర్కొండ పారవై’ సినిమా చేశారు. ఆ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. అందుకే అజిత్ ఆయనకు మరొక అవకాశం ఇచ్చారు. అదే ‘వాలిమై’ చిత్రం. ఈ సినిమాలో కూడ వినోత్ వర్క్ నచ్చడంతో మూడవ అవకాశం కూడ ఇచ్చారు. ‘వాలిమై’ పూర్తవగానే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

కేవలం రెండు నుండి మూడు నెలల్లో ఈ చిత్రాన్ని ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట అజిత్, వినోత్. ఈ ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో కూడ పూర్తిచేసేస్తారన్నమాట. 2022 అర్థభాగంలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం ఉంది. అజిత్ గత రెండు సినిమాలను నిర్మించిన బోనీ కపూర్ ఈ సినిమాను కూడా నిర్మించనున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలో ఒక సినిమాను రిలీజ్ చేసి వచ్చే ఏడాదిలో ఇంకొక సినిమాను విడుదల చేస్తారన్నమాట. 2022లో ఈ ఒక్క సినిమానే కాదు ఇంకొక సినిమా కూడ ప్రేక్షకులకు అందిస్తారు అజిత్.

సంబంధిత సమాచారం :