ఆ స్టార్ హీరో సినిమా ఓటీటీలో రిలీజయ్యే ప్రసక్తే లేదట

Published on May 21, 2021 12:02 am IST

అజిత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘వాలిమై’. లాక్ డౌన్ అనంతరం అజిత్ నుండి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్న సమయానికి లాక్ డౌన్ పడటంతో షూటింగ్ ఆగిపోయింది. ఇంకొక చిన్న షెడ్యూల్ మాత్రమే మిగిలుంది. అది పూర్తయితే సినిమా కంప్లీట్ అయినట్టే. అయితే షూటింగ్ మొదలవడానికి ఇంకో రెండు నెలల టైమ్ పట్టేలా ఉంది.

అయితే ఈలోపు సినిమా మీద రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడప్పుడే సినిమా హాళ్లు తెరుచుకునే వీలు లేకపోవడంతో సినిమాను నిర్మాతలు ఓటీటీకి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు మొదలయ్యాయి. అజిత్ సినిమాకు ఓటీటీల నుండి భారీ డీల్స్ వస్తున్న మాట నిజమే కానీ నిర్మాతలు మాత్రం ఓటీటీ విడుదలకు అస్సలు సుముఖంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలనేది నిర్మాతల నిర్ణయం. నిర్మాతల డెసిషన్ ఏమిటో తెలిశాక అజిత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :