కరోనా కష్టాలు.. స్టార్ హీరో ఫస్ట్ లుక్ వాయిదా

Published on Apr 23, 2021 10:00 pm IST

అజిత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘వాలిమై’. లాక్ డౌన్ అనంతరం అజిత్ నుండి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఫస్ట్ లుక్ విడుదల ఆలస్యం కావడంతో అభిమానులు అసహనానికి లోనై సోషల్ మీడియాలో పెద్ద రగడే చేశారు. దీంతో చిత్ర బృందం అజిత్ పుట్టినరోజైన మే 1వ తేదీన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని నిర్ణయించి అధికారిక ప్రకటన కూడ చేశారు. కానీ ఈలోపు దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ మొదలైంది. లక్షల్లో కేసులు వస్తున్నాయి. జనం మొత్తం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, జనం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం సబబు కాదని ‘వాలిమై’ టీమ్ నిర్ణయించుకుంది. అందుకే విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. వాయిదా తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అజిత్ హీరోగా ‘నెర్కొండ పారవై’ చిత్రాన్ని తెరకెక్కించిన ‘ఖాకీ’ ఫేమ్ హెచ్.వినోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్ సరసన హ్యూమా ఖురేషీ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :