పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా ఉండనున్న స్టార్ హీరో సినిమా !

తమిళ స్టార్ హీరో అజిత్ శివ దర్శకత్వంలో ‘విశ్వాసం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చెన్నైను పోలిన ఒక భారీ సెట్ ను నిర్మించారు. అక్కడే కొన్ని పాటల్ని, కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.

ఇప్పటీకే ఈ చిత్రానికి సంబందించిన రెండు పాటల కంపోజిషన్ కూడ పూర్తి కాగా యాక్షన్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్, కామెడీ కలిసి ప్రేక్షకుల్ని అన్ని విధాలా ఆకట్టుకునే పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతాన్ని అందివ్వనున్నారు.

‘వివేగం, వేదాళం, వీరం’ల తర్వాత శివ, అజిత్ ల కలయికలో వస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా కనిపించనుంది.