“అఖండ” తెలుగు స్టేట్స్ 5వ రోజు వసూళ్ల వివరాలు.!

Published on Dec 7, 2021 2:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కించిన రోరింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ”. భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి అంతే మొత్తంలో వాటిని అందుకొని భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వస్తే ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకుంటుంది. మరి ఈ చిత్రం ఐదవ రోజు వసూళ్లు ఏరియాల వారీగా చూసినట్లయితే..

నైజాం – 1.3 కోట్లు
వైజాగ్ – 40 లక్షలు
తూర్పు గోదావరి – 25 లక్షలు
పశ్చిమ గోదావరి – 17 లక్షలు
కృష్ణ – 23 లక్షలు
గుంటూరు – 24 లక్షలు
నెల్లూరు – 14 లక్షలు
సీడెడ్ – 75 లక్షలు

మొత్తంగా అఖండ ఐదవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు 3.48 కోట్లు షేర్ ని ఈ చిత్రం అందుకొని స్ట్రాంగ్ వసూళ్లు రాబడుతుంది. మరి ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :