యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో “అఖండ” గర్జన.!

Published on Dec 4, 2021 2:05 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ చిత్రం “అఖండ”. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం విడుదల అయ్యి ఆ అంచనాలను అన్ని చోట్లా కూడా రీచ్ అయ్యింది. అయితే యూ ఎస్ మార్కెట్ లో మాత్రం అఖండ సాలిడ్ గా నిలిచిందని చెప్పాలి. మామూలుగా అక్కడ మాస్ సినిమాలు ఈ రేంజ్ లో నిలబడడం చాలా రేర్.

కానీ అలాంటిది అఖండ మాత్రం నిలబడి భారీ వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తుంది. లేటెస్ట్ గానే ఈ చిత్రం అక్కడ 5 లక్షల 50 వేల డాలర్ల మార్క్ ని క్రాస్ చేసి స్టాండర్డ్ గా కొనసాగుతుంది. మరి ఇదే కొనసాగితే ఈ చిత్రం అక్కడ 1 మిలియన్ మార్క్ ని కూడా సునాయాసంగా అందుకుంటుంటుంది అని టాక్. మొత్తానికి మాత్రం అఖండ గర్జన అక్కడ కూడా గట్టిగానే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :