మొత్తానికి “అఖండ” నుంచి సింపుల్ గానే ముగించేశారు.!

Published on Jun 11, 2021 2:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంకొంత మేర మాత్రమే షూట్ బ్యాలన్స్ ఉంచుకుంది. త్వరలోనే షూట్ స్టార్ట్ చేసుకోనున్న ఈ చిత్రం నుంచి నందమూరి అభిమానులు నిన్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా చాలానే ఎక్స్పెక్ట్ చేసారు.

కానీ చెప్పుకోదగ్గ ట్రీట్స్ ఏమి మేకర్స్ నుంచి రాకపోవడంతో కాస్త నిరాశ పడ్డారు. ఒక నార్మల్ పోస్టర్ ను మేకర్స్ బాలయ్య పుట్టినరోజుకి ముందే రిలీజ్ చెయ్యడంతో బర్త్ డే రోజున గత ఏడాది లానే సడెన్ సర్ప్రైజ్, ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ లాంటిది ఏమన్నా ఉంటుందేమో ఆశించగా మొత్తానికి అవేమి లేకుండానే మేకర్స్ ముగించేశారు. మరి ఇవన్నీ మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :