“అఖండ” మాస్ యుఫోరియా..మూడో వారం కూడా హౌస్ ఫుల్ బోర్డులు!

Published on Dec 19, 2021 4:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మాస్ సినిమా “అఖండ”. ఈ డిసెంబర్ 2న రిలీజ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టారు.

అయితే బాలయ్య మరియు బోయపాటి ల హ్యాట్రిక్ విజయం యుఫోరియా మొదటి రెండు వారాల్లో ఆగలేదు. అక్కడ నుంచి అసలైన మాస్ చూపించింది. ఇప్పుడు భారీ సినిమాలు పోటీ ఉన్నా కూడా ఈరోజు ఈ ఆదివారం కూడా అఖండ తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.

పదుల సంఖ్యల థియేటర్స్ లో ఈరోజు అఖండ మ్యాట్నీ మరియు ఫస్ట్ సెకండ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయట. దీనితో అఖండ జాతర మూడో వారం కూడా థియేటర్స్ లో హవా కొనసాగుతుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :