“అఖండ” విడుదల అప్పటికి షిఫ్ట్ అయ్యిందా.?

Published on May 7, 2021 11:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “అఖండ”. బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వస్తున్న ఈ భారీ చిత్రంపై అంతే స్థాయి అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ మూలాన అనేక సినిమాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

మరి ఈ క్రమంలోనే ఈ చిత్రం కూడా వాయిదా పడినట్టు అధికారికంగా తెలుపలేదు కానీ మేకర్స్ కొత్త విడుదల సమయం కోసం ఆల్రెడీ ఎదురు చూస్తున్నారట. అన్నీ కుదిరినట్టయతే అఖండ విడుదల బహుశా సెప్టెంబర్ లో ఉండొచ్చని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :