“అఖండ” ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆమె నుంచి.!

Published on May 13, 2021 1:00 pm IST

నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ “అఖండ” తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అంచనాలు కూడా నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే వచ్చిన టీజర్ కు కూడా భయారే రెస్పాన్స్ రాగా మళ్ళీ వచ్చిన ఈ గ్యాప్ లో అభిమానులు అంతా మరిన్ని అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరి ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కాస్తా ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ నుంచి వస్తాయని తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇచ్చే ఓ లైవ్ ఇంటర్వ్యూ ద్వారా అఖండ పై కూడా పలు ఆసక్తికర అంశాలనే పంచుకోనున్నట్టు తెలుస్తుంది. మరి అవేంటో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :