“అఖండ” వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి డేట్ ఫిక్స్..!

“అఖండ” వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి డేట్ ఫిక్స్..!

Published on Apr 8, 2022 11:00 PM IST

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని అన్ని చోట్ల భారీగానే కలెక్షన్లను రాబట్టుకుంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రగ్య జైస్వాల్ నటించగా, శ్రీకాంత్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఇక తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇదిలా ఉంటే బిగ్ స్క్రీన్‌పై మాత్రమే కాకుండా ఓటీటీ వేదికగా కూడా పలు రికార్డులను తిరగరాసిన అఖండ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్దమయ్యింది. ఏప్రిల్ 10వ తేది స్టార్‌మా లో సాయంత్రం 6 గంటలకు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను “అఖండ” అలరించబోతుందని చిత్ర బృందం తెలిపింది. దీంతో బాలయ్య “అఖండ” మాస్ జాతరను థియేటర్, ఓటీటీలో చూడని వారు ఎంచక్క ఈ ఆదివారం టీవీల్లో చూసేయొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు