స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న అఖిల్…ఏజెంట్ ఫస్ట్ లుక్ విడుదల!

Published on Jul 12, 2021 12:00 pm IST

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రం లో అఖిల్ ఎలా ఉండబోతున్నాడు అనేది చిత్ర యూనిట్ వెల్లడించింది. ఏజెంట్ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయింది. అయితే ఈ చిత్రం లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం కోసం అభిల్ పూర్తి గా మారిపోయాడు. గతం లో ఏ చిత్రం లో లేని విధంగా డిఫరెంట్ లుక్ తో అదరగొట్టాడు. అయితే ఈ చిత్రం గురించి అఖిల్ మట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

365 రోజుల క్రితం దర్శకుడు సురేందర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు అని తెలిపారు. అయితే మానసికంగా శారీరకంగా ఇప్పుడు ఎంతో బలంగా ఉన్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే మీరు నాలో రగిలించిన అగ్ని ఈ చిత్రం లో కనిపిస్తుంది అంటూ అఖిల్ అక్కినేని చెప్పుకొచ్చారు. రామబ్రహ్మ సుంకర నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తాజాగా మొదలైంది.

సంబంధిత సమాచారం :