వరల్డ్ వైడ్ అదరగొట్టేసిన ‘లెనిన్’ మొదటి రోజు వసూళ్లు.. డే 2 మార్జిన్ గ్యారెంటీ?

వరల్డ్ వైడ్ అదరగొట్టేసిన ‘లెనిన్’ మొదటి రోజు వసూళ్లు.. డే 2 మార్జిన్ గ్యారెంటీ?

Published on Jul 11, 2026 1:59 PM IST

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ సినిమానే “లెనిన్”. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ ఎమోషనల్ విలేజ్ డ్రామా మంచి టాక్ ని సొంతం చేసుకొని ఇప్పుడు సాలిడ్ బుకింగ్స్ ని కొనసాగిస్తుంది. ఇలా వరల్డ్ వైడ్ గా మంచి నంబర్స్ ని ఈ సినిమా అందుకుంటుంది అని అంతా నమ్మిన నేపథ్యంలో మేకర్స్ డే 1 కి సంబంధించి అధికారిక నెంబర్ రివీల్ చేశారు.

దీనితో లెనిన్ సినిమా వరల్డ్ వైడ్ గా 16.7 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇది అఖిల్ కెరీర్ లో మరో సాలిడ్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక మొదటి రోజు ఇలా ఉంటే రెండో రోజు కూడా దాదాపు ఈ రేంజ్ లేదా ఇంతకు ఎక్కువే వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ బుకింగ్ యాప్స్ లో లెనిన్ బుకింగ్స్ గట్టిగానే కొనసాగుతున్నాయి. సో రెండో రోజు బుకింగ్స్, వసూళ్లు మొదటి రోజు కంటే ఎక్కువ వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు