సమ్మర్ ట్రీట్ రెడీ చేస్తున్న అఖిల్.. రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘లెనిన్’..!

సమ్మర్ ట్రీట్ రెడీ చేస్తున్న అఖిల్.. రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘లెనిన్’..!

Published on Jan 5, 2026 8:03 PM IST

Lenin

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ (Lenin) ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో పూర్తి మాస్ లుక్‌తో అఖిల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

రొమాంటిక్ మెలోడిగా సాగే ‘వారెవా వారెవా’ పాట ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఈ పాటలో అఖిల్ లుక్స్, భాగ్యశ్రీ క్యూట్‌నెస్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక థమన్ అందించిన సంగీతం ఈ పాటను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. కాగా, ఈ పాటతో పాటు ఈ చిత్రానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. లెనిన్ (Lenin) చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించినట్లు అయింది. ఇక ఈ సినిమాతో అఖిల్, భాగ్యశ్రీ బొర్సె కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు