‘అఖిల్’ సెన్సార్ & రన్ టైం డీటైల్స్

‘అఖిల్’ సెన్సార్ & రన్ టైం డీటైల్స్

Published on Nov 5, 2015 5:50 PM IST
akhil

అక్కినేని ఫ్యామిలీ హీరోస్ తో పాటు కుటుంబ సభ్యులు, అక్కినేని అభిమానులు, వీరితో పాటు తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘అఖిల్’. దీని కోసం ఎందుకు ఇంతలా ఎదురు చూపులు అంటే అక్కినేని ఫ్యామిలీ మూడవ తరం వారసుడు, నాగార్జున – అమలల ముద్దుల తనయుడు అఖిల్ అక్కినేని ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ రోజు సెన్సార్ కి వెళ్లనుంది అని ఈ రోజు ఉదయమే తెలియజేశాం.

చెప్పినట్టుగానే ఈ రోజు మధ్యాహ్నం సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాని చూసి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. సెన్సార్ వారు అఖిల్ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా రన్ టైం ని కూడా 2గంటల 10 నిమిషాలకి లాక్ చేసారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తమిళంలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు