ఊహించని తేడా చూపిస్తున్న అఖిల్

అఖిల్ అక్కినేని ‘హలో’ చిత్రం ఈ నెల 22న విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే చిత్ర ఆడియో వేడుక కూడా వైజాగ్లో ఘనంగా మొదలైంది. ఇప్పటికే విదిఉదాన్ టీజర్, ట్రైలర్లకు విపరీతమైన స్పందన రాగా ఈ మధ్యే విడుదలైన వెడ్డింగ్ సాంగ్ “మెరిసే మెరిసే’, కొద్దిసేపటి క్రితమే బయటికొచ్చిన టైటిల్ సాంగ్ ట్రైలర్ ‘హలో’ కు విపరీతమైన స్పందన దక్కుతోంది.

వీటిని చూసిన ప్రేక్షకులంతా మొదటి సినిమాలోని అఖిల్ కు ‘హలో’ సినిమాలో అఖిల్ కు చాలా తేడా కనిపిస్తోందని, హావా భావాలు, యాక్షన్ ఎపిసోడ్స్, మరీ మరీ ముఖ్యంగా డాన్స్ మూమెంట్స్ లోను ఎంతో పరిణితి కనిపిస్తోందని, అఖిల్ చాలా ఇంప్రూవ్ అయ్యాడని , ఇంత మార్పును అస్సలు ఊహించలేదని కితాబిస్తున్నారు.

అఖిల్ ఇంతలా మెరుగుపడటం వెనుక ఆయన కృష్టి పాటు తండ్రి నాగార్జున పర్యవేక్షణ కూడా ఎంతో ఉంది. ‘అఖిల్’ పరాజయం తర్వాత రెండవ సినిమాను పూర్తిగా చేతుల్లోకి తీసుకున్న నాగ అన్నీ తానై సినిమాను, అఖిల్ ను ముందుకు నడిపి బెటర్ రిజల్టును ప్రేక్షకులకు అందిస్తున్నారు.