మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా హీరోయిన్ భాగ్యశ్రీ కలయికలో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన లవ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా “లెనిన్”. మంచి బజ్ నడుమ వచ్చిన ఈ సినిమా భాగ్యశ్రీ అలానే అఖిల్ ఇద్దరికీ సాలిడ్ హిట్ గా నిలిచి బ్రేక్ ఇచ్చింది. ఇలా వీకెండ్ రన్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి వచ్చిన అయ్యగారు.. ఇక్కడ కూడా స్టడీ పెర్ఫామెన్స్ తో దూసుకెళ్తున్నారు.
అయితే అఖిల్ మొన్న సోమవారం బుక్ మై షో బుకింగ్స్ 70 వేలకి పైగా టికెట్ సేల్స్ ఉంటే నిన్న మంగళవారం 60 వేల మేర ఉన్నాయి. అంతే కాకుండా నార్త్ అమెరికాలో కూడా 6 లక్షల 50 వేల డాలర్లు ఈ సినిమా అందుకుంది. సో లెనిన్ మాత్రం స్టడీగా దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా కింగ్ నాగార్జున, సూర్య దేవర నాగవంశీ నిర్మాణం వహించారు.


