వరల్డ్ వైడ్ ‘లెనిన్’ బాక్సాఫీస్ టార్గెట్?

వరల్డ్ వైడ్ ‘లెనిన్’ బాక్సాఫీస్ టార్గెట్?

Published on Jul 9, 2026 11:55 AM IST

Lenin

ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ సినిమానే “లెనిన్”. అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా హీరోయిన్ భాగ్యశ్రీ కలయికలో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ ఎమోషనల్ విలేజ్ డ్రామా పట్ల మంచి బజ్ ఆల్రెడీ నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా అఖిల్ గత సినిమా నుంచి ఇప్పటికి ఇంత గ్యాప్ వచ్చినప్పటికీ లెనిన్ కి వరల్డ్ వైడ్ మంచి బిజినెస్ నే జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లెనిన్ థియేట్రికల్ గా 22 కోట్లకి పైగా టార్గెట్ తో బాక్సాఫీస్ దగ్గర దిగుతున్నట్టు తెలుస్తుంది.

సో ఈ సినిమా సుమారు 45 కోట్ల గ్రాస్ ని రాబడితే సేవ్ అయిపోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సూర్య దేవర నాగవంశీ అలాగే కింగ్ నాగార్జునలు తమ బ్యానర్ లపై నిర్మాణం వహించారు.

తాజా వార్తలు