
అఖిల్ మూడో సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఏరే సినిమాను నిర్మిస్తున్నారు. తొలిప్రేమ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చడంతో నాగార్జున ఈ పాయింట్ ను ఓకేచేసినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
హలో సినిమా తరువాత అఖిల్ చెయ్యబోయే సినిమా కు ముందుగా వేరే దర్శకుల పేర్లు వినిపించినా చివరికి వెంకి అట్లూరి ఈ సినిమాను హ్యాండిల్ చెయ్యబోతుండడం విశేషం. ఈ సినిమా టైటిల్, హీరోయిన్ వంటి విషయాలు త్వరలో తెలియున్నాయి. భారీగా కాకుండా చిత్ర ఆఫీస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.

