
నటుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పిల్లర్ గా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ నుంచి మూడవ తరం హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని. మనం సినిమా చివర్లో కొసమెరుపులా మెరిసిన అఖిల్ తన తొలి సినిమా వివి వినాయక్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాంతో ఈ చిత్ర టీం ఈ సినిమా ఫస్ట్ టీజర్, ఆడియో మరియు మూవీ రిలీజ్ ల కోసం స్పెషల్ డేట్స్ ని ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున బర్త్ డే కానుకగా ఆగష్టు 29న ఫస్ట్ టీజర్ ని మరియు అక్టోబర్ 22న దసరా కానుకగా సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉన్నారని ఇది వరకే తెలియజేశాం.
తాజా ఈ చిత్ర సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం అఖిల్ మొదటి సినిమా ఆడియోని ఎఎన్ఆర్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 20న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ తన మొదటి సినిమా ప్రతి ఈవెంట్ స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ రిలీజ్ డేట్స్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ద్వారా సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దాంతో నితిన్ చాలా దగ్గరుండి ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు చూసుకుంటున్నాడు.

