అఖిల్ కి కొత్త హీరోయినే ఫిక్స్ అయ్యేలా ఉంది !

Published on Jun 20, 2019 7:15 am IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కాస్టింగ్ మొత్తం పూర్తయింది. ఒక్క హీరోయిన్ తప్ప. ఈ నెల 26 నుంచి మొదటి షెడ్యూలు కూడా మొదలు కానుంది. అయితే ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఆ మధ్య కియరా అద్వానీ లేదా రష్మికా మండన్నలో ఎవరో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదని తేలిపోయింది.

తాజా సమాచారం ప్రకారం అఖిల్ సరసన దాదాపు కొత్త హీరోయిన్ నే ఫైనల్ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినా చివరికీ కొత్త అమ్మాయి వైపే మొగ్గు చూపారట. ఇక అఖిల్ కి ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఈ సినిమా కూడా భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

సంబంధిత సమాచారం :

More