అక్కినేని వారి యువ నటవారసుడు ప్రస్తుతం నటిస్తున్న మూడవ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే అయన ప్రస్తుతం, ఇటీవల తొలిప్రేమతో మంచి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టైటిల్ ని మిస్టర్ మజ్ను గా ఫిక్స్ చేసారని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట.
ఇక తొలి చిత్రం అఖిల్ తో ప్లాప్ చవిచూసిన అఖిల్, ఆ తరువాత విక్రమ్ కే కుమార్ తో చేసిన హలో చిత్రంతో యావరేజ్ హిట్ కొట్టాడు. కాగా అక్కినేని అభిమానులు ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఇన్ని ఆశలు పెట్టుకున్న అఖిల్-3 రేపు విడుదల తరువాత ఆయనకు ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే .
