అక్కినేని ఫ్యామిలీలో ‘అఖిల్’ న్యూ రికార్డు!!

అక్కినేని ఫ్యామిలీలో ‘అఖిల్’ న్యూ రికార్డు!!

Published on Nov 9, 2015 11:57 PM IST

Akhil

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు, తెలుగు సినీ అభిమానులు కూడా అక్కినేని ఫ్యామిలీ మూడవతరం నట వారసుడు అఖిల్ యాక్టింగ్ స్కిల్స్ చూడడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దానికోసం ఇంకెంతో దూరం లేదు.. మరో 36 గంటల్లో అఖిల్ అక్కినేని నటించిన మొదటి సినిమా ‘అఖిల్’ ఇరు రాష్టాల్లోని థియేటర్స్ లో సందడి చేయనుంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ అఖిల్ మరియు అక్కినేని కుటుంబ సభ్యుల్లో టెన్షన్ పెరుగుతోంది. అలాగే అక్కినేని అభిమానులు కూడా మా యంగ్ హీరో ఎలా మెప్పిస్తాడో అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నాడు.

ఆ క్రేజ్ తో అఖిల్ సినిమాకి మొదటి రోజే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ ఈ రోజు ఉదయం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రతి చోటా అఖిల్ టికెట్స్ జోరుగా అమ్ముడు పోతున్నాయి. ఇదిలా ఉంటే.. మామూలుగా స్టార్డం వచ్చాక ఆ హీరోలకి బెనిఫిట్ షోస్ ఉంటాయి. కానీ అఖిల్ కి మాత్రం మొదటి సినిమాతోనే ఆ క్రెడిట్ దక్కించుకున్నాడు. హైదరాబాద్ లో నవంబర్ 10వ తేదీ రాత్రి ‘అఖిల్’కి రెండు బెనిఫిట్ షోస్ ని ప్లాన్ చేసారు. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ క్రియేట్ చేస్తున్న రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్నేళ్లలో నాగార్జున సినిమాకి ఎప్పుడూ బెనిఫిట్ షో పడలేదు, అలాగే నాగ చైతన్య సినిమాలకి ఎప్పుడూ బెనిఫిట్ షోస్ వేయలేదు. కానీ అఖిల్ మాత్రం మొదటి సినిమాకే బెనిఫిట్ షోస్ కి ఆడియన్స్ ని రాబట్టుకునే క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కావున అక్కినేని ఫ్యామిలీ హీరోస్లో అఖిల్ సృష్టించిన న్యూ రికార్డ్ అని చెప్పాలి.

తాజా వార్తలు