‘అఖిల్’ కొత్త ట్రైలర్ రిలీజ్‌కు రెడీ!

‘అఖిల్’ కొత్త ట్రైలర్ రిలీజ్‌కు రెడీ!

Published on Nov 8, 2015 6:28 PM IST

Akhil
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీకి ‘అఖిల్’ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ సిద్ధమైన విషయం తెలిసిందే. దసరా కానుకగా విడుదల కావాల్సిన అప్పట్లో కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు దీపావళి కానుకగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులే ఉండడంతో అఖిల్ టీమ్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్‌ను చివరిదశకు చేర్చింది. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్, హీరో అఖిల్ ఇలా అందరూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగాణే వైజాగ్‌లోని కళావాహిని ఆడిటోరియంలో నేడు అఖిల్ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫంక్షన్‌ కోసం అఖిల్ ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. ఇక సినిమా యూనిట్‌తో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు కూడా ఈ ఫంక్షన్‌కు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగానే అఖిల్ సినిమాకు సంబంధించిన ఓ కొత్త ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ట్రైలర్ రిలీజ్‌కు రెడీగా ఉందని, నేడు గానీ రేపు గానీ ట్రైలర్‌ను విడుదల చేస్తామని అఖిల్ తెలిపారు. దాదాపుగా ఈ సాయంత్రమే ట్రైలర్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అఖిల్ సినిమాతో అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో హీరో సినీ పరిశ్రమకు పరిచయం కానుండడం అక్కినేని అభిమానులకు సంబరాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే అఖిల్ థియేటర్ల దగ్గర అభిమానుల సందడి మొదలవడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు