
వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటివలే కంప్లీట్ అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలలో హీరో అఖిల్ పై ఇంట్రడక్షన్ ఫైట్ చిత్రీకరించారు.మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వినాయక్ తన సినిమాలలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తారో మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఫైట్ ను కూడా అదిరిపోయేలా షూట్ చేశారట.
‘ఫస్ట్ షెడ్యూల్ వాజ్ అమైజింగ్ ఎక్స్ పీరియన్స్. అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్ తీసిన స్టంట్ మాస్టర్ రవి వర్మకు థాంక్స్ చెప్పాల్సిందే. సం అమైజింగ్ ఫుటేజ్.’ అని అఖిల్ ట్వీట్ చేశారు.
అఖిల్ సరసన సాయేష సైగల్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందించగా కోన వెంకట్ మాటలు రాస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువహీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులలో అంచనాలు బాగున్నాయి.
My first schedule was an amazing experience and I really must thank @stuntraviverma for an amazing introduction fight. Some amazing footage
— Akhil Akkineni (@AkhilAkkineni8) February 24, 2015

