అవన్నీ పుకార్లే : అఖిల్

అవన్నీ పుకార్లే : అఖిల్

Published on Dec 12, 2015 9:23 AM IST

Akhil
అక్కినేని అఖిల్.. అక్కినేని వంశం నుంచి ఈ మధ్యే హీరోగా ఎంట్రీ ఇచ్చి మెప్పించిన హీరో. తన మొదటి సినిమా అఖిల్, బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా అతడికి మాత్రం హీరోగా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ నేఫథ్యంలో తాను చేయబోయే రెండో సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలన్నది టార్గెట్‌గా పెట్టుకొని అఖిల్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సరైన స్క్రిప్ట్‌ను, దర్శకుడిని ఎంచుకునే క్రమంలో చర్చలు జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అఖిల్ నటించబోయే రెండో సినిమా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఉంటుందని, బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వార్తలపై స్పందిస్తూ అఖిల్ తన ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను చాలా ఓపిగ్గా పకడ్బందీగా తన రెండో సినిమాను ఎంచుకునే పనిలో ఉన్నానని, ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదని, ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ పుకార్లే అని తెలియజేశారు. అన్నీ సెట్ అయ్యాక తన కొత్త సినిమా విశేషాలను పంచుకుంటానని అఖిల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

తాజా వార్తలు