ఎన్టీఆర్ మాటల పై స్పందించిన అఖిల్ !

ఎన్టీఆర్ మాటల పై స్పందించిన అఖిల్ !

Published on Jan 24, 2019 1:00 AM IST

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేస్తోన్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’.ఇక మజ్ను ప్రీ రిలీజ్ వేడుకకు జూ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా వచ్చి.. అఖిల్ కి ఆత్మ విమర్శ చేసుకున్నే ధైర్యం ఉందని.. భవిష్యత్తులో అఖిల్ మంచి నటుడు అవుతాడని.. ఆ రోజు కోసం అక్కినేని అభిమానులతో పాటు నేను కూడా ఎదురుచూస్తానని అఖిల్ ని పొగడ్తలతో ముంచెత్తాడు తారక్.

కాగా తాజాగా అఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. తారక్ తన గురించి చెప్పిన మాటల పై స్పందిస్తూ.. జనరల్ గా బయట తారక్ నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడు. కానీ ఆడియో ఈవెంట్ లో మాత్రం నా గురించి మాట్లాడుతూ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. తారక్ అలా మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యానని అఖిల్ అన్నాడు.

ఇక ఈ చిత్రం ఫై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు