సెన్సార్ కంప్లీట్ చేస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”

Published on Sep 29, 2021 12:00 pm IST

అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బాచ్ లర్”. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం అక్కినేని అభిమానులు ఎప్పుడు నుంచో ఊరిస్తూ వస్తుంది. పైగా అఖిల్ కెరీర్ లో మంచి హిట్ గా కూడా నిలిచే అవకాశం ఉందని కూడా బజ్ ఉంది. మరి ఎట్టకేలకు మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే దసరా కానుకగా రిలీజ్ చెయ్యడానికి సన్నద్ధం చెయ్యగా..

ఇప్పుడు సినిమా సెన్సార్ ని కంప్లీట్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాకి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందజేశారు. సో ఈ సినిమాలో మాస్ క్లాస్ సహా అన్ని హంగులు ఉండడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ కూడా మేకర్స్ రిలీజ్ చేస్తుండగా దానికోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందివ్వగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం వచ్చే అక్టోబర్ 15న రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :