“ఏజెంట్” ఫస్ట్ లుక్ లో ఊహించని అవతార్ తో అఖిల్.!

Published on Apr 8, 2021 10:00 am IST

అక్కినేని నవ యువ హీరో అఖిల్ అక్కినేని తన సినిమాల ఫలితాలకు సంబంధం లేకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ కు మంచి అంచనాలు సెట్ చేసుకోగలడు. అలా తాను చేసిన లాస్ట్ మూడు చిత్రాలు కూడా సరైన హిట్ కాకపోయినా ఇప్పుడు చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

మరి ఇదే అనుకుంటే ఇంకా ఇది లైన్ లో ఉండగానే స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తో ప్లాన్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రం తాలూకా టైటిల్ సహా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేసారు. అయితే మొదటి నుంచి వస్తున్న టాక్ ప్రకారమే ఈ చిత్రానికి “ఏజెంట్” అనే టైటిల్ ను పెట్టేసారు. స్పై తరహాలో ఈ చిత్రం ఉంటుంది అని వచ్చిన టాక్ కు అనుగుణంగా ఈ టైటిల్ సెట్ అయ్యింది.

అయితే ఇక్కడ స్పెషల్ గా చెప్పాల్సింది అఖిల్ లుక్ కోసమే అని చెప్పాలి. లాంగ్ హెయిర్ తో సిగరెట్ కాలుస్తూ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని సాలిడ్ అవతార్ లో దర్శనం ఇచ్చాడు. మరి అఖిల్ ను ఏ తరహా ఏజెంట్ లా సురేందర్ ప్రెజెంట్ చేస్తారో చూడాలి. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా రామ బ్రహ్మం సుంకర నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :