స్టెప్స్ వెయ్యడం కోసం మునిచ్ కి బయల్దేరిన ‘అఖిల్’ టీం

స్టెప్స్ వెయ్యడం కోసం మునిచ్ కి బయల్దేరిన ‘అఖిల్’ టీం

Published on Sep 1, 2015 7:36 PM IST

akhil
అక్కినేని ఫ్యామిలీ మూడవతరం హీరోగా అఖిల్ అక్కినేని తన ఫస్ట్ సోలో మూవీ అయిన ‘అఖిల్’తో అక్టోబర్ 21న టాలీవుడ్లో అరంగేట్రం చేయనున్నాడు. కమర్షియల్ సినిమా అనగానే గుర్తుకు వచ్చే వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం 2 పాటల షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. అందులో ఓ పాటని షూట్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ఈ రోజు ఉదయం జర్మనీలోని మునిచ్ కి బయలుదేరింది. మునిచ్ లో ఇప్పటి వరకూ చూడని అందమైన లొకేషన్స్ లో ఈ పాటలని షూట్ చేయనున్నారు. అఖిల్ తో పాటు హీరోయిన్ సయేషా సైగల్ కూడా ఈ సాంగ్ షూట్ లో పాల్గొననుంది.

అక్కడి నుంచి వచ్చాక ఫైనల్ సాంగ్ షూట్ ని హైదరాబాద్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో షూట్ చేయనున్నారు. ఆ పాటతో సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇటీవలే నాగ్ బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ‘అఖిల్’ ఫస్ట్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. అఖిల్ సినిమా ఆడియోని స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 20న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెలోడీ టచ్ – మాస్ బీట్ ఏదీ మిస్ కాకూడదని అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ లను మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఎంచుకున్నారు. నితిన్ తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ‘అఖిల్’ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు