అఖిల్ మూడో సినిమా ప్రకటన అప్పుడేనా ?
Published on Mar 13, 2018 5:43 pm IST

‘హలో’ సినిమా తరువాత అఖిల్ చెయ్యబోతున్న సినిమాకు ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను ఉగాది పండుగ రోజున (మార్చి 18) అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు అక్కినేని కాంపొండ్ నుండి తెలుస్తోంది.

ఏప్రిల్ రెండో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చని సమాచారం. ‘హలో’ విడుదలయ్యాక చాలా మంది దర్శకులు అఖిల్ కు కథలు చెప్పడం జరిగింది. కాని వెంకి అట్లూరి చెప్పిన పాయింట్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు.

 
Like us on Facebook