ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా ఒక్క సినిమా కూడా చేయకుండా హాట్ ప్రాపర్టీ గా మరీన నటుడు అక్కినేని అఖిల్. ‘మనం’ సినిమాలో అఖిల్ చేసింది అతిథి పాత్రే, కానీ అతని స్టైల్ కి నటనకి వీపరీతమైన క్రేజ్ వచ్చింది.
అయితే ఇప్పుడు అఖిల్ తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం అయింది. ఈ ఏడాది చివర్లో అఖిల్ సినిమా మొదలుకానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అఖిల్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. అలియా భట్ కు కూడా మంచి క్రేజ్ ఉండడంతో వీరిద్దరి జంట తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
అయితే అఖిల్ తొలి చిత్రాన్ని ఎవ్వరు డైరెక్ట్ చేస్తారనే విషయం ఇంకా తెలియరాలేదు. దేవ కట్ట అని కొందరు, మరో దర్శకుడు అని కొందరు అంటున్నారు, దీనికి సంబంధించి త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.


