స్పెయిన్ కి బై బై చెప్పనున్న అఖిల్ టీం

స్పెయిన్ కి బై బై చెప్పనున్న అఖిల్ టీం

Published on May 25, 2015 6:29 PM IST

Akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న నవతరం నటవారసుడు అక్కినేని అఖిల్. అఖిల్ హీరోగా మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర టీం స్పెయిన్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ చేస్తోంది. ఇటీవలే అఖిల్ పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. మాకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం అఖిల్ మూవీ స్పెయిన్ షెడ్యూల్ నేటితో ముగియనుంది. రేపు ఈ చిత్ర టీం బయలుదేరి ఇండియాకి తిరిగి రానున్నారు. స్పెయిన్ లో షూట్ చేసిన మేజర్ షెడ్యూల్ అవుట్ పుట్ విషయంలో వివి వినాయక్ మరియు అఖిల్ లు చాలా హ్యాపీ గా ఉన్నారు. అక్కడ షూట్ చేసిన సాంగ్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని అంటున్నారు.

ఒక చిన్న గ్యాప్ తర్వాత మరో న్యూ షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టనున్నారు. ఈ హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత సాంగ్ షూటింగ్ కోసం ఈ చిత్ర టీం సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారు. అఖిల్ తో పాటు బాలీవుడ్ భామ సయేషా సైగల్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది. అఖిల్ మొదటి సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. అఖిల్ మొదటి సినిమా విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని నితిన్ దగ్గరుండి మరీ ప్రొడక్షన్ వాల్యూస్ ని చూసుకుంటున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజా వార్తలు