అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే . ఈ సినిమాను హీరో నితిన్ నిర్మింస్తుండడం విశేషం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే యూకేలో ఓ భారీ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ సరసన సయేషా హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా నేడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేశారు. అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో చూపించిన మేకింగ్‌ను చూసిన తర్వాత సినిమాను ఎంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారనేది అర్థమైపోతుంది. నితిన్ ఈ సినిమా విషయంలో అన్నీ దగ్గరుండి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ టీజర్‌లో అఖిల్‌ను చూసిన వారెవరైనా మరో ప్రామిసింగ్ హీరో తెలుగు తెరకు పరిచయం కానున్నాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఖాయం. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాకు ఎస్. ఎస్. థమన్, అనూప్ రూబెన్స్ ఇద్దరూ సంగీతం సమకూర్చనుండడం విశేషం.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


