అఖిల్ – వినాయక్ మూవీలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్

akhil-vv-vinayak-nithin-mov

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అక్కినేని యంగ్ టాలెంట్ అఖిల్ ని ఫిబ్రవరి 14న గ్రాండ్ గా లాంచ్ చేసారు. అఖిల్ ని పరిచయం చేస్తున్న వివి వినాయక్ ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని ఈ రోజు నుంచి హైదరాబాద్ లో మొదలు పెట్టారు. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అఖిల్ అంటున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ ‘నా మొదటి సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, వాటిని మీ అందరికీ అమితంగా నచ్చేలా డిజైన్ చేస్తున్నామని’ తెలిపాడు.

అఖిల్ లాంచ్ వేడుకలో నాగార్జున కూడా అఖిల్ సినిమాలో రొమాన్స్ కంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని తెలిపాడు. అలాగే మాస్ పల్స్ తెలిసిన వినాయక్ దర్శకుడు కావడంతో ఈ సినిమా పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అంటున్నారు. నార్త్ ఇండియన్ భామ సయేశా సైగల్ అఖిల్ తో ఈ మూవీలో జోడీ కట్టనుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని హైదరబాద్ ఓల్డ్ సిటీలో మొదలు పెట్టి అఖిల్ పై ఇంట్రడక్షన్ ఫైట్ ని షూట్ చెయ్యనున్నారు. అఖిల్ మొదటి సినిమాకి ‘ఢమరుకం’ ఫేం వెలిగొండ శ్రీనివాస్ కథని అందిస్తుంటే కోన వెంకట్ – గోపి మోహన్ కథా సహకారం – డైలాగ్స్ అందిస్తున్నారు. నితిన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Exit mobile version