అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. సమంత ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపిస్తుందనే ఆ రూమర్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వస్తున్నాయట. ఈ సీన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయట. అన్నట్లు ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.
ఇక ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. ఈ సినిమాతోనైనా అఖిల్ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు.


