ఆకట్టుకుంటోన్న ‘అఖిల్’ కొత్త ట్రైలర్!

ఆకట్టుకుంటోన్న ‘అఖిల్’ కొత్త ట్రైలర్!

Published on Nov 4, 2015 9:16 PM IST

akhil
‘అఖిల్’.. దసరా కానుకగా భారీ ఎత్తున విడుదలవుతుందని అభిమానులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూయించి, చివరికి చివరి నిమిషంలో వాయిదా పడిన సినిమా. అక్కినేని వంశంలోని మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అక్కినేని అఖిల్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచే భారీ హైప్ ఉంది. ఆ హైప్‌తో పాటే దసరాకు విడుదలవుతుందనుకున్న సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇక మళ్ళీ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని చూస్తోన్న అభిమానులకు దీపావళి కానుకగా సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించేసి సినిమా యూనిట్ పండగ వాతావరణాన్ని కల్పించింది.

నవంబర్ 10న దీపావళి కానుకగా అఖిల్ సినిమా విడుదల కానుంది. ఇక సినిమా విడుదలకు దగ్గర పడుతుండడంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉదయం తమిళ వర్షన్‌కు సంబంధించి అఖిల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ మొదట్లో తెలుగులో విడుదల చేసిన ట్రైలర్ కంటే చాలా బాగుందనే చెప్పాలి. ఇంటరెస్టింగ్ అంశాలను, కథాంశాన్ని తెలియజేస్తూ తయారుచేసిన ఈ కొత్త ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించడంలో ఉపయోగపడుతుందనే చెప్పాలి. అక్కినేని ఫ్యాన్స్‌ను ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇదే వర్షన్‌లో ఒక తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తే రిలీజ్‌కు ముందు బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను హీరో నితిన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన విషయం తెలిసిందే!

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు