మెగాస్టార్ సిస్టర్ గా అక్కినేని అమల ?

Published on Jul 3, 2021 10:40 pm IST

మెగాస్టార్ చిరంజీవి రీమేక్ మూవీ “లూసిఫర్” సినిమా పై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. అక్కినేని అమల మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ ను సెట్ చేస్తే నిజంగానే అదిరిపోతుంది. తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని, చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పాత్ర పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ లో అక్కినేని అమల నటిస్తే చాల బాగుంటుంది. అయితే, ఈ వార్త పై చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర చాల కీలకంగా ఉంటుంది. ఆ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారట. టైటిల్ పేరు ‘రారాజు’. నిజంగానే ఈ టైటిల్ మెగాస్టార్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మోహన్ రాజాకి ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. మోహన్ రాజా తమిళంలో “జయం” వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు.

సంబంధిత సమాచారం :