‘సవ్యసాచి’ కోసం అభిమానుల ఎదురుచూపులు !

‘సవ్యసాచి’ కోసం అభిమానుల ఎదురుచూపులు !

Published on Jun 7, 2018 5:55 PM IST

51

అక్కినేని హీరో నాగ చైతన్య వరుస షూటింగ్లతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’, మారుతితో ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి చిత్రాల్ని చేస్తున్నారు. వీటిలో ముందుగా మొదలైన ‘సవ్యసాచి’ దాదాపుగా పూర్తైంది. కానీ ఇప్పటికి వరకు ఈ సినిమా నుండి ఒక్క ఫస్ట్ లుక్ మినహా మరే విశేషమూ బయటకురాలేదు.

సినిమా విడుదల కూడ జూలైలో కావడంతో అభిమానులు కనీసం టీజర్ అయినా వదిలితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి చిత్ర యూనిట్ ఫ్యాన్స్ విజ్ఞప్తిని గమనించి త్వరలో టీజర్ ను విడుదల చేస్తారో లేదో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ కథానాయకిగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు